జాన్వీ కపూర్‌- వరుణ్‌ ధావన్ జోడీ రిపీట్‌ | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్‌- వరుణ్‌ ధావన్ జోడీ రిపీట్‌

Published Fri, Feb 23 2024 12:42 AM

Varun Dhawan and Janhvi Kapoor to star in Sunny Sanskari Ki Tulsi Kumari - Sakshi

బాలీవుడ్‌ మూవీ ‘బవాల్‌’ లో(2023) జోడీగా కనపించి ఆడియన్స్‌ను మెప్పించారు హీరో వరుణ్‌ ధావన్, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌. తాజాగా ఈ జోడీ రిపీట్‌ అవుతోంది. బాలీవుడ్‌లో ‘ధడక్‌’, ‘బద్రీనాథ్‌ హీ దుల్హనియా’  సినిమాలను తెరకెక్కించిన శశాంక్‌ కేతన్‌ తాజాగా ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్‌ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది.

ఈ చిత్రంలో సన్నీగా వరుణ్‌ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్‌ నటిస్తారు. కరణ్‌ జోహార్, యశ్‌ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్‌ కేతన్‌ ఈ మూవీ నిర్మించనున్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్‌ సమాచారం. 2025 ఏప్రిల్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు తెలుగులో ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు జాన్వీ కపూర్‌. 

Advertisement
 
Advertisement
 
Advertisement