నెట్టింట వైరల్‌ అవుతున్న ‘వారసుడు’ వర్కింగ్‌ స్టిల్స్‌ | Sakshi
Sakshi News home page

నెట్టింట వైరల్‌ అవుతున్న ‘వారసుడు’ వర్కింగ్‌ స్టిల్స్‌

Published Thu, Oct 27 2022 4:52 PM

Varasudu Movie Working Stills Goes Viral In Social Media - Sakshi

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారిసు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది.  చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పది వర్కింగ్‌ స్టిల్స్‌ని ఒకేసారి విడుదల చేశారు మేకర్స్‌.

ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే  విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 

2023 సంక్రాంతికి వారసుడు  విడుదల చేస్తున్నట్లు  దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.పూర్తిస్థాయి ఎంటర్ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement