ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్! | Sakshi
Sakshi News home page

This Week Ott Releases: ఓటీటీల్లో సినిమాల పండగే.. ఆ సంచలన మూవీ కూడా!

Published Sun, Feb 18 2024 8:08 PM

This Upcoming Week Ott Releases From 19th February to 25th February - Sakshi

మరో వారం వచ్చేసింది. గతవారంలో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేశాయి. ఈ వీక్‌లోనూ థియేటర్లలో సందడి చేసేందుకు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ వీక్‌లో ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటిలాగే సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. అయితే ఈ వీక్‌లో పెద్ద సినిమాలేం లేనప్పటికీ.. ఆ మూడు చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. ఆలియా భట్ నిర్మించిన  క్రైమ్‌ సిరీస్‌ పోచర్‌, మోహన్‌ లాల్‌ మూవీ మలైకొట్టై వాలిబన్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ మూవీ కాస్తా ఇంట్రెస్టింగ్‌ కనిపిస్తున్నాయి. మరీ ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో మీరు ఓ లుక్కేయండి. 

ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే.. 


నెట్‌ఫ్లిక్స్‌

 • రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(రియాలిటీ సిరీస్)-  ఫిబ్రవరి 19
 • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ చిత్రం)- ఫిబ్రవరి 19
 • మైక్ ఎప్స్: రెడీ టు సెల్‌ అవుట్(కామెడీ సిరీస్)- ఫిబ్రవరి 20
 • క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 21
 • అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
 • సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22
 • త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
 • మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23
 • ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
 • ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
 • ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్-  ఫిబ్రవరి 23
 • మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ -  ఫిబ్రవరి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

 • స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21
 • విల్ ట్రెంట్‌ సీజన్‌-2 (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 21

అమెజాన్ ప్రైమ్

 • పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
 • మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23(రూమర్ డేట్)

Advertisement

తప్పక చదవండి

Advertisement