అప్పటి ఈ హీరో, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? | Twinkle Khanna,Mayuri Kango, Kim Sharma Started New Business | Sakshi
Sakshi News home page

అప్పటి ఈ హీరో, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

May 9 2021 2:10 PM | Updated on May 9 2021 2:33 PM

Twinkle Khanna,Mayuri Kango, Kim Sharma Started New Business - Sakshi

చేస్తున్న పని నచ్చకపోతే అదెంత పేరు తెచ్చేదైనా పక్కన పెట్టేస్తాం. నచ్చిన పని మన పాపులారిటీని పెంచకపోయినా పర్‌ష్యూ చేస్తాం. ఈ పుటలో ప్రస్తావించబోయే  వ్యక్తులూ అంతే. నటులుగా వాళ్లు పాపులర్‌. కాని ఇప్పుడు అడుగుపెట్టిన రంగానికి వాళ్లు కొత్తే. అందుకే ఇక్కడ ఆ పరిచయం. 

కిమ్‌ శర్మ
తెలుగువాళ్లకూ పరిచయమే. ముసుగు వెయ్యొద్దు మనసు మీద (ఖడ్గం) అంటూ యువత మనసుల మీది ముసుగు లాగేసిందీ బోల్డ్‌ యాక్ట్రెస్‌. పెళ్లయ్యాక సిల్వర్‌ స్క్రీన్‌కు గుడ్‌బై చెప్పి కెన్యా వెళ్లిపోయింది. అక్కడ ఖాళీగా కూర్చోలేదు. బ్రైడల్‌ గ్రూమింగ్‌ సర్వీస్‌ సెంటర్‌ను స్టార్ట్‌ చేసింది. బ్రహ్మాండంగా సాగుతోందట. 



ట్వింకిల్‌ ఖన్నా
పేరు వింటేనే మనిషి గుర్తొచ్చేంత ఫేమస్‌ ఈ నటి. తల్లిదండ్రులు డింపుల్‌ కపాడియా, రాజేశ్‌ ఖన్నా వారసురాలిగానే అడుగు పెట్టినా తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంది. నటనతో కాదు ఇంటీరియర్‌ డిజైనర్, రచయిత్రిగా. ఆమె భర్త అక్షయ్‌ కుమార్‌ టాప్‌ హీరో అన్న విషయమూ తెలిసిందే. భర్త పేరుతోనూ ఆమెను పోల్చుకోరు ప్రేక్షకులు. అదీ ట్వింకిల్‌ అస్తిత్వం. మల్టీటాలెంటెడ్‌ ఉమన్‌గా ఆమె సాధిస్తున్న విజయం. 



డినో మోరియా
ఆరడగులు కండలవీరుడిగా బాలీవుడ్‌లో డినో మోరియాకు విపరీతమైన క్రేజ్‌.. మోజు కూడా.  అయినా అతను నటించిన కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో ఇంకా అట్టే ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించక నటనకు ప్యాకప్‌ చెప్పేసుకున్నాడు. ‘క్రీప్‌ స్టేషన్‌ కేఫ్‌’ అని రెస్టారెంట్‌ తెరిచాడు. అతని యాక్టింగ్‌ కెరీర్‌ కన్నా అద్భుతంగా రన్‌ అవుతోంది ఆ రెస్టారెంట్‌. అప్పుడప్పుడు ఓటీటీ సిరీస్‌లోనూ అప్పియర్‌ అవుతున్నాడు డినో. 



దీపాన్నిత శర్మ
టీవీ సీరియల్స్, సినిమా ప్రియులకు బాగా తెలిసిన నటి. నటించడం ఆపేసి జీవిత కలను నెరవేర్చుకొమ్మని మెదడు చేసిన సూచనను ఫాలో అయింది. ‘షాజ్మా’ అనే పడవను కొనుక్కొని ముంబై సముద్రంలో తిప్పుతూ అందులో లగ్జరీ పార్టీలను అరెంజ్‌ చేస్తోంది. 



కుమార్‌ గౌరవ్‌
నాటి బాలీవుడ్‌ నటుడు రాజేంద్రకుమార్‌ వారసుడిగా (కొడుకు) బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నెగ్గాడు కూడా.  ప్రేక్షకుల్లో తనకు డిమాండ్‌ తగ్గిపోతుందని గ్రహించిన వెంటనే బిజినెస్‌ రంగంలోకి దిగాడు. మాల్దీవ్స్‌లో ట్రావెల్‌ బిజినెస్‌ ప్రారంభించాడు. అన్నేళ్ల నటనారంగంలోని సంపాదన కన్నా రెట్టింపు రాబడి, రెట్టింపు ఉత్సాహంతో వ్యాపారంలో రాణిస్తున్నాడు కుమార్‌ గౌరవ్‌. 



మయూరీ కాంగో
‘ఘర్‌ సే నికల్తే హీ కుఛ్‌ దూర్‌ చల్తే హీ రస్తే మే హై ఉస్కా ఘర్‌ ’ 1990ల మధ్యకాలంలోని యువను ఉర్రూతలూగించిన పాట. 1996లో వచ్చిన  ‘పాపా కహెతే హై’ సినిమాలోనిది. ఆ పాటను కథానాయిక మయూరీ కాంగో, నాయకుడు జుగల్‌ హంస్‌రాజ్‌ మీద చిత్రీకరించారు. ఆ సినిమాతో మయూరీ కాంగో ఫేమస్‌ అయిపోయింది. తర్వాత కొన్ని చిత్రాల్లోనూ కనిపించింది. కానీ ఎందుకో ఉన్నట్టుండి ఆ పాపులారిటీ అంటే విరక్తి పుట్టింది.. నటన అంటే ఆసక్తి తగ్గింది ఆమెకు. అమెరికా వెళ్లిపోయింది. న్యూయార్క్‌ యూనివర్శిటీలో చేరి మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. ఢిల్లీ వచ్చేసి గుర్‌గావ్‌లోని ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో మార్కెటింగ్‌ హెడ్‌గా పనిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement