
బుల్లితెర నటి సమీరా షెరిఫ్ (Sameera Sherief) సంతోషంలో తేలియాడుతోంది. ఇటీవల ఆమె రెండోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తాజాగా ఈ బుడ్డోడికి పేరు కూడా పెట్టేసింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పిల్లాడి ఫేస్‌ను రివీల్ చేసింది. 'సయ్యద్ ఆమిర్'ను మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ జర్నీ అంత ఈజీగా జరగలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. అప్పుడు నా కడుపులో ఉన్న ఆమిర్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు.
నీకోసం నేను నిలబడతా
నేను బాధలో ఉన్నప్పుడు దాన్ని అధిగమించే శక్తినిచ్చాడు. ఏం జరుగుతుందో? ఏంటో? అన్న భయంలో కూరుకుపోయినప్పుడు నాకు ధైర్యాన్నిచ్చాడు. ఇప్పుడు బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తనకు అండగా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ విషయంలో మేము వెనకడుగు వేసేదే లేదు. మేమిద్దరం జంటగా అన్నీ ఎదుర్కొన్నాం. లేబర్ గదిలో చాలాసేపు పురిటినొప్పుల బాధ అనుభవించాక వీడు పుట్టాడు. ఇది మా హృదయాల్లో శాశ్వతంగా గుర్తుండిపోతుంది.
గర్విస్తున్నాం
ఆమిర్.. నువ్వు మా జీవితాల్లోకి రావడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాం. మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాం. హీరా భయ్యా కూడా ఫుల్ ఖుషీ అవుతున్నాడు. నిన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా? అని రోజులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నాడు. నీకోసమే ఆలోచించాడు. మన కుటుంబమంతా నిన్ను చూసి గర్విస్తోంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు బాబును ఎత్తుకున్న ఫోటోలను జత చేసింది. ఇది చూసిన అభిమానులు మరోసారి సమీరాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సమీరా.. అభిషేకం, ముద్దుబిడ్డ, భార్యామణి, ఆడపిల్ల వంటి పలు సీరియల్స్ చేసింది. కొన్ని షోలకు యాంకర్‌గానూ పని చేసింది.
చదవండి: నాలో ఏదైనా లోపం ఉందా? సరైన దారిలో లేనా?.. ఏడ్చేసిన మిత్ర