Sharwanand Gets Injured In Road Accident In Hyderabad - Sakshi
Sakshi News home page

Sharwanand Car Accident: హీరో శర్వానంద్‌కు ప్రమాదం.. కొద్ది రోజుల్లోనే పెళ్లి, అంతలోనే ఇలా...లక్కీగా..

May 28 2023 10:28 AM | Updated on May 28 2023 12:00 PM

Tollywood Young Hero Sharwanand Injured In Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌కి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిన్తున్న రేంజ్‌ రోవర్‌ కారు..  ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి.. బోల్తా పడింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న బైక్‌ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో శర్వానంద్‌కి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శర్వానంద్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం పై శర్వానంద్‌ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు స్పందించలేదు. 

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇటీవల తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం రాజస్తాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శర్వానంద్‌కు ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement