బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్‌..! | Sakshi
Sakshi News home page

Navdeep: బెంగళూరు రేవ్‌ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్‌..!

Published Sun, May 26 2024 3:29 PM

Tollywood Hero Navdeep Responds Bangalore Rave Party News

బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్‌, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్‌లో హేమకు పాజిటివ్‌ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

‍అయితే గతంలో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు సమయంలో హీరో నవదీప్‌ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్‌ మౌళి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్‌ న్యూస్‌లో కనిపించడం లేదు కదా సార్‌ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్‌ అని అడగడంతో నవదీప్‌ స్పందించారు.

ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్‌ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్‌ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్‌ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్‌ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ జూన్‌ 7న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement