స్వీయ రక్షణ అవసరం | Thera Venuka movie Updates | Sakshi
Sakshi News home page

స్వీయ రక్షణ అవసరం

Dec 30 2020 6:33 AM | Updated on Dec 30 2020 6:33 AM

Thera Venuka movie Updates - Sakshi

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తమ్ముడు అమన్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘తెర వెనుక’. ‘బంతిపూల జానకి’ ఫేమ్‌ నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వం వహించారు. విజయలక్ష్మి మురళి మచ్చ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న దాడులను మా చిత్రంలో చూపిస్తున్నాం. 101, షీ టీమ్స్‌ ఎన్ని ఉన్నా స్వీయ రక్షణ ముఖ్యం అని చెబుతున్నాం. ఒక డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో  ఈ చిత్రం సాగుతుంది. అమన్‌ చక్కగా నటించాడు. శ్వేతా వర్మ చేసిన డీజీపీ పాత్ర సినిమాకే హైలెట్‌. ఓ రిటైర్డ్‌ డీఎస్పీ సూచనలతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈ సినిమా తీశాం. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఎలా ఉంటాయో  చూపించాం. నేను దర్శకత్వం వహించిన ‘సంత’ (మట్టి మనుషుల ప్రేమ కథ) చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement