న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరీగా ‘తెలుసా..మనసా’

Telusa Manasa Movie First Look poster Launched By Dil Raju - Sakshi

‘కేరింత’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పార్వతీశం. ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటింస్తున్న తాజా చిత్రం ‘తెలుసా..మనసా..’.  న్యూ ఏజ్ ప్లాటోనిక్ ల‌వ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జష్విక హీరోయిన్‌గా నటిస్తోంది. వైభవ్ సినిమా బ్యానర్ పై వర్ష ముదాడ, మాధవి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు విడుదల చేశారు. ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే అందులో రోహిణి హ‌ట్టంగ‌డి మంచంపై కూర్చుని ఉంటే ఆమె ప‌క్క‌నే హీరోయిన్‌, ఓ చిన్న బాబు కూర్చుని ఉన్నారు. మంచం ప‌క్క‌నే దానికి అనుకుని పార్వ‌తీశం కూర్చుని ఏదో ఆలోచిస్తూ క‌నిపిస్తున్నారు. 

‘విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే యువ‌కుడు (పార్వ‌తీశం), అదే ఊర్లో ప‌ని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జ‌శ్విక‌)ను ప్రేమిస్తాడు. ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి ప్రేమ ఉంటుంది కానీ ఎప్పుడూ వారిద్ద‌రూ ఆ ప్రేమ‌ను వ్య‌క్తం చేసుకోరు. మ‌ల్లి బాబు ప‌లు సంద‌ర్భాల్లో త‌న ప్రేమ‌ను  సుజాత‌తో చెప్పటానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ చెప్ప‌లేక‌పోతాడు. అయితే ఉన్న‌ట్లుడి మ‌ల్లి బాబు క‌ల‌లు కూలిపోతాయి. సుజాత‌కు దూరం కావాల్సి వ‌స్తుంది. మ‌రి వారిద్ద‌రూ క‌లుసుకున్నారా! అనేదే ఈ సినిమా కథ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top