Tamanna: స్టేజ్‌పై తమన్నా తీరుకు సౌత్‌ ఫ్యాన్స్‌ ఫిదా, ఏం చేసిందంటే..

Tamannaah Takes Off Her Shoe on Stage to Light Up Lamp At IFFM Award - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఓ అవార్డు ఫంక్షన్‌ కార్యక్రమంలో స్టేజ్‌పై తమన్నా వ్యవహించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌ (ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌) అవార్డు కార్యక్రమానికి తమన్నా ముఖ్య అతిథిగా హాజరైంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చదవండి: ఆమె అంటే క్రష్‌, ఆ స్టార్‌ హీరోయిన్‌తో నటించాలని ఉంది: నాగ చైతన్య

ఈ క్రమంలో ఈవెంట్‌ నిర్వాహకులు ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరోయిన్లు తమన్నా, తాప్సీ పన్ను సైతం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా తాప్సీ చెప్పులు ధరించే జ్యోతి ప్రజ్వలన చేయగా.. తమన్నా మాత్రం దక్షిణాది సంస్కృతి ఉట్టిపడేలా వ్యవహరించి, సౌత్‌ ప్రజలు ఔరా అనేలా చేసింది. జ్యోతి ప్రజ్వలన చేసే ముందు చెప్పులు పక్కకు విడిచి దీపం వెలిగించింది. ఆ పక్కనే ఉన్న ఈవెంట్‌ ఆర్గనైజర్‌ తమన్నాను.. ఇలా ఎందుకు చేశారు అని అడ్గగా.. ఇది దక్షిణాది సంస్కృతి అని బదులులిచ్చింది.

చదవండి: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్‌ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇందుకు సంబంధించిన వీడియోను తమన్నా ఫ్యాన్‌ ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజన్స్‌ అంత తమన్నాకు ఫిదా అవుతున్నారు. ‘తమన్నాకు దక్షిణాది నేర్పించింది ఇదే’ ,‘సంస్కృతిని గౌరవించడమంటే ఇదే కదా’, ‘చిన్న చిన్న విషయాలే గొప్పగా నిలబెడతాయి’, ‘భారతదేశ గొప్ప వారసత్వ సంస్కృతిని తమన్నా చూపించింది’ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top