బాహుబలిని మించిందేముంటుంది? నెక్స్ట్‌ ఏంటో అర్థం కాలే! | Tamannaah: How Do You Do Something Bigger Than Baahubali | Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: బాహుబలి తర్వాత ఏం చేయాలో తోచలేదు, నిజానికి నాకది అక్కర్లేదు!

Published Fri, Nov 29 2024 5:40 PM | Last Updated on Fri, Nov 29 2024 6:05 PM

Tamannaah: How Do You Do Something Bigger Than Baahubali

సినిమా సూపర్‌డూపర్‌ హిట్టయితే సెలబ్రిటీలకు ఓపక్క సంతోషంతోపాటు మరోపక్క ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ విజయాన్ని అలాగే కంటిన్యూ చేయాలని, ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని కష్టపడుతుంటారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా ఏం చేయాలో అర్థం కాలేదంటోంది హీరోయిన్‌ తమన్నా భాటియా.

సక్సెస్‌ అందుకున్నా, కానీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ... వయసులో నాకంటే పెద్దవారితో కలిసి పనిచేయడం, భాష తెలియని చోట పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు తెలుగు, తమిళం రెండూ వచ్చు. నేను కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నాను కానీ నటిగా ఇంకా విభిన్న పాత్రలు చేయాలన్న ఆకలి మాత్రం ఇంకా ఉంది.

బాహుబలి గేమ్‌ ఛేంజర్‌
నిజానికి కమర్షియల్‌గా సక్సెస్‌ అయిన తర్వాత ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం డిఫరెంట్‌ రోల్స్‌తో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. బాహుబలి విషయానికి వస్తే పాన్‌ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. అందరికీ ఓ గేమ్‌ఛేంజర్‌ వంటిది. అయితే ఈ సినిమా చేశాక నాకు ఓ విషయం అర్థం కాలేదు.

అర్థం కాని పరిస్థితి
నెక్స్ట్‌ ఏం చేయాలి? బాహుబలి కంటే పెద్ద సినిమా చేయాలా? ఇంతకంటే పెద్దది ఎలా చేస్తా? పోనీ నన్ను నేను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోవాలా? అన్న ప్రశ్నలతో సతమతమయ్యాను అని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా నటించిన లేటెస్ట్‌ మూవీ సికిందర్‌ కా ముఖద్దర్‌. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement