Taapsee Pannu Sensational Comments On South Indian Film Industry, Deets Inside - Sakshi
Sakshi News home page

దక్షిణాది చిత్రపరిశ్రమపై తాప్సీ వివాదస్పద వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌

Apr 19 2023 11:27 AM | Updated on Apr 19 2023 12:11 PM

Taapsee Pannu Sensational Comments On South Film Industry - Sakshi

సౌత్‌ సినిమా ఇండస్ట్రీపై సొట్టబుగ్గల సుందరి తాప్సీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో నటించడం వల్ల తను గుర్తింపు రాలేదని చెప్పింది. నటిగా తనను తాను నిరూపించుకోవడానికి సరైన పాత్రలు సౌత్‌లో రాలేదని తెలిపింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగినప్పటికీ సంతృప్తిని ఇచ్చే క్యారెక్టర్స్‌ లభించలేదని చెప్పింది.

(చదవండి: నా బెడ్‌రూమ్‌లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్‌ ఉంటాయి: ఖుష్బూ)

బాలీవుడ్‌లో నటించిన ‘పింక్‌’ చిత్రం తనకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టిందని వెల్లడించింది. ఈ సినిమా తర్వాత తన జీవితం మలుపు తిరిగిందని తాప్సీ చెప్పుకొచ్చింది. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు, నెటిజన్స్‌ మండిపడుతున్నారు.  టాలీవుడ్‌లో గుర్తింపు వచ్చింది కాబట్టే బాలీవుడ్‌ ఆఫర్స్‌ వచ్చాయని కామెంట్స్‌ చేస్తున్నారు. 

గతంలోనూ టాలీవుడ్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేని విమర్శలు ఎదుర్కొంది తాప్సీ. టాలీవుడ్‌ హీరోయిన్స్‌ను గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తారంటూ ఓ ప్రముఖ దర్శకుడిని ఉద్దేశించి కామెంట్‌ చేసింది.  అప్పట్లో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement