సుశాంత్‌ సోదరిపై రియా ఫోర్జరీ కేసు | Sushant Case: Rhea Chakraborty Files Forgery Case Against Priyanka | Sakshi
Sakshi News home page

ప్రియాంక బోగస్‌ ప్రిస్క్రిప్షన్‌ ఇచ్చింది.. అందువల్లే..!

Sep 7 2020 8:28 PM | Updated on Sep 7 2020 8:58 PM

Sushant Case: Rhea Chakraborty Files Forgery Case Against Priyanka - Sakshi

సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సుశాంత్‌ సోదరి ప్రియాంకపై రియా చక్రవర్తి సోమవారం ఫోర్జరీ కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియాపై డ్రగ్‌ కేసు కూడా నమోదైన క్రమంలో తాజాగా ఆమె సుశాంత్‌ సోదరిపై ఫిర్యాదు చేయడంతో మరింత ఆసక్తిని రేకిస్తోంది. ఈ ఫిర్యాదులో ప్రియాంక, సుశాంత్‌కు సంబంధించిన బోగస్‌ మెడికల్‌ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చిందని, ఈ బోగస్‌ ప్రిస్కిప్షన్‌ వచ్చిన 5 రోజుల్లోనే సుశాంత్‌ మరణించాడని ఆమె తెలిపింది. అంతేగాక ఢిల్లీలో రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది.‌ (చదవండి: అరెస్టు అయ్యేందుకు సిద్ధం.. ప్రేమించడం నేరం కాదు!)

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు జూన్‌ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు  తెలిపింది. సుశాంత్‌కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో వైద్యం చేయడం వల్లే మరణించాడని డాక్టర్‌ తరణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.  ఈ కేసులో సుశాంత్‌ సోదరి ప్రియాంక, డాక్టర్‌ తరుణ్‌లతో పాటు తదితరులను విచారించాల్పిందిగా రియా ఫిర్యాదులో పేర్కొంది. అయితే సుశాంత్‌ మృతి కేసులో రియాపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆమె డ్రగ్స్‌ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రియా ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిపై డ్రగ్‌ కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె సోదరుడు షోవిక్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఎన్‌సీబీ విచారణలో షోవిక్, తనకేం తెలియదని‌ రియానే తనను డ్రగ్స్‌ తీసుకురమ్మని చెప్పిన్టలు అతుడు అధికారులకు చెప్పడంతో రియా చూట్టు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
(చదవండి: సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొన్నా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement