
కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. తొలి మూడు రోజుల్లో భారీగానే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీ ఇప్పటివరకు పెద్దగానే వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కూడా కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది.
అయితే థగ్‌లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్‌ను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పిన ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో థగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.
అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. చాలా ఏళ్ల తర్వాత కమల్- మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శింబు, త్రిష కీలక పాత్రలు పోషించారు.