ఫిలిం ఛాంబర్‌ అధ్యక్ష పదవికి రాజీనామా.. ఆ కారణం వల్లే.. | Suniel Narang Resigned from Telangana State Film Chamber Of Commerce | Sakshi
Sakshi News home page

ఫిలిం ఛాంబర్‌ అధ్యక్ష పదవికి సునీల్‌ నారంగ్‌ రాజీనామా

May 20 2026 1:37 PM | Updated on May 20 2026 1:43 PM

Suniel Narang Resigned from Telangana State Film Chamber Of Commerce

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్ష పదవి నుంచి ఏషియన్‌ మూవీస్‌ అధినేత, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ సునీల్‌ నారంగ్‌ వైదొలిగారు. ఈ మేరకు ఛాంబర్‌ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఈమెయిల్‌ ద్వారా తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నావల్ల కాదు
'కొందరు కార్యవర్గ సభ్యులను మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి నేను పని చేయలేను. అలాగే నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఛాంబర్‌ ఎప్పుడూ ఏకాభిప్రాయంతో నడవాలి. ప్రస్తుతం అలా జరగడం లేదు' అని ఫిలిం ఛాంబర్‌కు రాసిన లేఖలో సునీల్‌ నారంగ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సునీల్‌ నారంగ్‌ రాజీనామాను ఫిలిం ఛాంబర్‌ ఆమోదించింది.

అసలేంటి వివాదం?
ఇటీవల టాలీవుడ్‌లో పర్సంటేజీ (కమిషన్‌) విధానంపై వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే! సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కూడా పర్సంటేజీ సిస్టమ్‌ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరగా అగ్రనిర్మాతలు అంగీకరించడం లేదు. కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు జరుగుతున్న పర్సంటేజీ వివాదమే సునీల్‌ రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

 

 

చదవండి: ఆస్పత్రిలో అమితాబ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement