సుధాకర్ కోమాకుల 'మెమొరీస్'మ్యూజిక్‌ వీడియో వచ్చేస్తోంది

Sudhakar Komakula Memories Music Video Teaser - Sakshi

నారాయణ అండ్‌ కో చిత్రంతో అలరించిన యంగ్‌ హీరో సుధాకర్‌ కోమాకుల..ఇప్పుడు ‘మోమురీస్‌’అనే మ్యూజిక్ వీడియోతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top