సండే స్టార్ మా లో ప్రేమలోకం !

Star Maa Non Fiction Shows - Sakshi

ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు "100% లవ్".

 తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి "100% లవ్" అన్ని హంగులతో రాబోతోంది. సరదాగా ఆడుకునే  ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు... ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు "100% లవ్" ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top