స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ అరెస్ట్‌ | Stand Up comedian arrested by Kakinada Police | Sakshi
Sakshi News home page

స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ అరెస్ట్‌

Apr 16 2026 10:48 AM | Updated on Apr 16 2026 11:01 AM

Stand Up comedian arrested by Kakinada Police

హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. టాలీవుడ్‌ నటి, నిర్మాత నిహారిక కొణిదెల విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. పవన్ కల్యాణ్‌ మూడు వివాహాల గురించి ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు చేయడంతో కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనుదీప్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో  ఆయన ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో తాజాగా కాకినాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement