ఓపక్క క్లైమాక్స్‌ షూటింగ్‌.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌..: రాజమౌళి | SS Rajamouli Release First Look Poster Of Prithviraj Sukumaran From SSMB29, Photo Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రాజమౌళి.. ఒక్క ట్వీట్‌తో..

Nov 7 2025 9:24 AM | Updated on Nov 7 2025 10:48 AM

SSMB29: SS Rajamouli Release First Look Poster of Prithviraj Sukumaran

సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా #SSMB29. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ఎప్పుడో మొదలైంది. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి ఒక్క అప్‌డేట్‌ వదిలినా సరే.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తామని ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. 

క్లైమాక్స్‌ షూటింగ్‌
అలాంటి సమయంలో జక్కన్న కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. పృథ్వీరాజ్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 'మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్‌ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందెన్నడూ చూడనివిధంగా ఈ ఈవెంట్‌ని జరపాలనుకుంటున్నాం. నవంబర్‌ 15న ఈ కార్యక్రమాన్ని మీరంతా ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఈ వారమంతా మీరు హుషారుగా ఉండేందుకు కొన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నాం.. మొదటగా.. ఈరోజు పృథ్వీరాజ్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తున్నాం' అని ట్వీట్‌ చేశారు.

ఓటీటీలో లైవ్‌
ఇది చూసిన అభిమానులు మీరు వారమంతా ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలని కామెంట్లు చేస్తున్నారు. నవంబర్‌ 15న జరిగే ఈవెంట్‌లో సినిమా టైటిల్‌తో పాటు మహేశ్‌బాబు ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ ఈవెంట్‌ను అందరూ చూసేందుకు వీలుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారట!

 

 

చదవండి: The Girlfriend: రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement