Is SS Thaman Gives a Strong Counter to Nani? - Sakshi
Sakshi News home page

SS Thaman: ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన తమన్‌ వరుస ట్వీట్లు

Dec 30 2021 2:57 PM | Updated on Dec 30 2021 5:48 PM

Is SS Thaman Gives a Strong Counter to Nani? - Sakshi

యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌ తమన్‌ హిట్‌ మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఎప్పుడూ మిస్టర్‌ కూల్‌గా కనిపించే తమన్‌ తాజాగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ట్వీట్స్‌ నానిని ఉద్దేశించే చేసినవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్యామ్‌ సింగరాయ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నాని మాట్లాడుతూ..

'తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్‌ లాగానే మ్యూజిక్‌కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని.. సంగీతం లేదా బీజీఎం సినిమాను ఎలివేట్‌ చేయాలే తప్పా.. డామినేట్‌ చేయకూడదని, లేదంటే శృతి తప్పుతుంది' అని పేర్కొన్నాడు.

దీనికి కౌంటర్‌గా తమన్‌.. అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్‌ దేనిని డామినేట్‌ చేయదని వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నానిని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నార. కాగా అఖండ సినిమాకు బీజీఎం మెయిన్‌ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement