కార్తి సోదరిగా నటించబోతున్న యంగ్‌ హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

కార్తి సోదరిగా నటించబోతున్న యంగ్‌ హీరోయిన్‌

Published Sun, Feb 18 2024 7:44 AM

Sri Divya Plays Sister Role In Karthi 27th Film - Sakshi

తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకిగా నటించిన నటి శ్రీదివ్య. ఇప్పుడు అక్క, చెల్లెలి పాత్రలకు పరిమితం అవుతుందా అంటే అవుననే చెప్పాలి. వరుత్త పడాద వాలిబర్‌ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తెలుగింటి అమ్మాయి శ్రీ దివ్య. ఆ తర్వాత కార్తీ, విష్ణు విశాల్‌, విశాల్‌, జీవీ ప్రకాష్‌కుమార్‌ వంటి హీరోల సరసన నాయకిగా నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటిది ఆ తరువాత ఈ అమ్మడు అనూహ్యంగా తెరమరుగైన పరిస్థితి. కారణాలు ఏమైనా నటిగా చాలా గ్యాప్‌ తీసుకున్న శ్రీదివ్య ఆ మధ్య విక్రమ్‌ప్రభు సరసన రైడ్‌ చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా కార్తీ సరసన నటించే అవకాశం వరించినట్లు ప్రచారం జరిగింది.

కార్తీ ప్రస్తుతం తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి 96 ఫ్రేమ్‌ ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా ఇందులో శ్రీదివ్య కథానాయకిగా నటించడం లేదన్నది తాజా సమాచారం. ఇందులో ఆమె నటుడు కార్తీకి సోదరిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరిచే విషయమే అవుతుంది. అయితే కార్తీకి జంటగా స్వాతికొండే నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రం నుంచి కుటుంబ బంధాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement