ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి

SP Balu funerals Completed In Farmhouse - Sakshi

సాక్షి, చెన్నై : తన గాన లహరితో భారతావనిని ఓలలాడించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అశ్రు నివాళుల మధ్య ముగిశాయి. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌ లో అంతిమ సంస్కారాలు జరిగాయి. శ్రౌత‌ శైవ ఆరాధ్య‌‌ సంప్ర‌దాయం ప్ర‌కారం బాలుని ఖ‌న‌నం చేశారు. అంత‌కు ముందు కుటుంబసభ్యులు సంప్ర‌దాయబ‌ద్ధంగా వైదిక క్ర‌తువు పూర్తి చేశారు. దీంతో సొలసితి అంతట నీ శరణనే చొచ్చితిని అంటూ ఆయన ఇక శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!)

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రితో పాటు సూపర్‌స్టార్‌ విజయ్‌, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top