Sonu Sood: ఈ నాలుగు రోజులు అతిథులతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఓకే

Sonu Sood Responds On Income Tax Department Raids - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కార్యాలయాలు, ఇతర స్థల్లాల్లో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. నటుడికి సంబంధించిన అన్నిచోట్లా ఒకేసారి సోదాలు‍ నిర్వహించారు. ఆయనకు చెందిన సోనూ సూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. దాడుల అనంతరం సోనూ.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టలేదని తేల్చినట్లు అధికారులు చెప్పారు.

ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. ఈ నాలుగు రోజులు అతిథులతో (ఐటీ అధికారులు) బిజీగా ఉండడం వల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు నేను తిరిగి వచ్చా. మీ సేవకై నా ప్రయాణం కొనసాగుతుంది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నాడు.

చదవండి: రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top