Sonu Sood: రక్తంతో సోనూసూద్ పెయింటింగ్.. షాక్ అయిన నటుడు

సినిమాల్లో విలన్ పాత్రలు వేస్తూ నిజజీవితంలో మాత్రం ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేసి ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. నటనతో పాటు సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్‌కి దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు.
తాజాగా మధు గుర్జార్ అనే ఫ్యాన్ సోనూసూద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో సోసూసూద్ పెయింటింగ్ వేసి ఆయనకే బహుమతిగా ఇచ్చాడు. అభిమాని చేసిన పనికి షాక్ అయిన సోనూసూద్ రక్తంతో తన బొమ్మను గీయడం కంటే రక్తదానం చేస్తే ఇంకా సంతోషించేవాడినని చెప్పుకొచ్చారు.
దీనికి సంబంధించిన వీడియోను సోనూసూద్ ట్విట్టర్‌లో షేర్‌చేస్తూ రక్తం వృథా చేయకుండా దానం చేయాలని కోరాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. సోసూసూద్ చివరగా చాంద్ బార్దాయ్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ख़ून दान करो मेरे भाई
ख़ून से मेरी पेंटिंग बना कर व्यर्थ नहीं🙏
बहुत बहुत आभार ❤️🙏 https://t.co/6j6Pih36Fq— sonu sood (@SonuSood) September 9, 2022