మ‌రోసారి డ్యాన్స్‌తో చెల‌రేగిన‌ సితార

Sitara Dance Video For Her Favourite Song - Sakshi

అగ్ర‌హీరో మ‌హేశ్‌బాబు గారాల తన‌య సితార మ‌రోసారి డ్యాన్స్‌తో ఇర‌గ‌దీసింది. అయితే ఈ సారి ఇంగ్లీష్ పాట‌కు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను మ‌హేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకున్నారు. అటు సితార కూడా త‌న అకౌంట్‌లో ఈ డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ త‌న‌కు ఈ పాట ఎంతో ఇష్ట‌మని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ డ్యాన్స్ అభిమానులంద‌రినీ ఓ ఊపు ఊపేస్తోంది. గ‌తంలో తండ్రి సినిమా 'మ‌హ‌ర్షి'లో నుంచి పాల‌పిట్ట పాట‌కు, స‌రిలేరు నీకెవ్వ‌రులో 'డాంగ్ డాంగ్' పాట‌కు స్టెప్పులేసిన విష‌యం తెలిసిందే. (మీకు తెలియనంతగా ప్రేమిస్తా: మహేశ్‌)

కాగా మ‌హేశ్‌ లాక్‌డౌన్‌లో దొరికిన స‌మ‌యాన్నంత‌టినీ భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార‌తో క‌లిసి కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారితో క‌లిసి దిగిన ఫొటోల‌ను కూతురి డ్యాన్స్ వీడియోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటున్నారు. కాగా జూలై 20న సితార ఎనిమిద‌వ‌ పుట్టిన‌రోజు జ‌రుపుకుంది. మ‌రోవైపు మ‌హేశ్ ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం నుంచి ఈపాటికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. (న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top