Shocking Remuneration Of Singer Sid Sriram Per One Song Goes Viral - Sakshi
Sakshi News home page

సిద్‌ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Apr 24 2021 1:01 PM | Updated on Apr 24 2021 4:15 PM

Singer Sid Sriram Charges Whopping Remuneration Per Song - Sakshi

సింగర్‌ సిద్‌ శ్రీరామ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌ ఆయన. సిద్‌ శ్రీరామ్‌ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్‌ టాక్‌ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్‌ హిట్‌ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలతోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దీంతో ఆయనతో ఒక్క పాట అయినా పాడించాలని సంగీత దర్శకులు ఉవ్విళూరుతున్నారు.

తాజాగా 'నీలినీలి ఆకాశం, ఒకే ఒక లోకం నువ్వు , మాటె వినధుగ..వినధుగ, ఏమై పోయావే' వంటి పాటలు సిద్‌ శ్రీరామ్‌ పాడినవే. అయితే ఆ సినిమాల రిజల్ట్‌ ఎలా ఉన్నా సిద్‌ శ్రీరామ్‌ పాట మాత్రం​ హిట్‌ అవుతోండటంతో సినిమా ప్రమోషన్‌గా వాడేస్తున్నారు నిర్మాతలు. ఇక అల వైకుంఠపురమలోని 'సామజవరగమనా', గీత గోవిందంలోని 'ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే' పాటలు బంపర్‌ హిట్‌గా నిలిచాయి. 

మరి ఇంత క్రేజ్‌ ఉన్న సిద్‌ శ్రీరామ్‌ తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సాధారణంగా సింగర్‌ను బట్టి 20 వేల నుంచి 50 వేలు, మహా అయితే 1.5లక్షల దాకా రెమ్యూనరేషన్‌ ఇస్తారట. అయితే సిద్‌ శ్రీరామ్‌కున్న మార్కెట్‌ను బట్టి ఆయనకు 4.5లక్షలు ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒక్క పాటకే ఆయన ఈ రేంజ్‌లో చార్జ్‌ చేయడం విశేషం. యూత్‌లో మంచి కక్రేజ్‌ ఉన్న సింగర్‌గా సిద్‌ శ్రీరామ్‌కు పేరుండటంతో ఆయన అడిగినంత ఇవ్వడంలో నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది. 

చదవండి : హాట్‌ టాపిక్‌గా మారిన పవన్‌ కల్యాణ్ రెమ్యూనరేషన్‌
నా కొడుకు లవ్‌ బ్రేకప్‌కు ఆ హీరోయిన్లే కారణం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement