Bpraak: విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్‌ దంపతులు

Singer B Praak Couple Lose Their Newborn Baby At The Time Of Birth - Sakshi

ప్రముఖ సింగర్‌ బిప్రాక్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఎంతో ఆశగా ఎదురు చూసిన ఈ సింగర్‌ దంపతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పది నెలల క్రితం బిప్రాక్‌ భార్య మీరా గర్భవతి అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పుట్టిన మరుక్షణమే పోత్తిళ్లలోనే కన్నుమూసిన ఘటన ఈ దంపతులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని సింగర్‌ బిప్రాక్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.

చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య

గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాకు బిడ్డ పుట్టింది. కానీ అంతలోనే ఆ బిడ్డ మమ్మల్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయింది. పుట్టిన సమయంలోనే మా బిడ్డ చనిపోయింది. ఇది తల్లిదండ్రులుగా మేం భరించలేని ఒక దశ. చివరి వరకు మా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించిన  వైద్యులకు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట పరిస్థితిలో మాకు సపోర్ట్ చేసిన వారికి, అభిమానులకు ధన్యవాదాలు.. ఈ సమయంలో మా గోప్యతను మాకు అందించమని మీ అందరిని అభ్యర్థిస్తున్నాం’ అంటూ బిప్రాక్‌ రాసుకొచ్చాడు.

చదవండి: కమల్‌ సర్‌ నాకు ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వలేదు: అనిరుధ్‌

ఇక అతడి పోస్ట్‌పై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సింగర్‌ బిప్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌ చిత్రాలకు పాటలు పాడుతూ, స్టేజి షో లలో బిప్రాక్‌ మంచి సింగర్‌గా గుర్తింపు పొందాయి. అంతేకాదు అతడి పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో సూర్యుడివో చంద్రుడివో అనే పాట పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల క్రితం తన ప్రియురాలు మీరాను వివాహమాడిన ఆయన ఇటీవలే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిపాడు. దీంతో అభిమానులు త్వరగా మీరా బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top