శింబు @ అరసన్ | Simbu and director Vetrimaaran upcoming film titled Arasan finalized | Sakshi
Sakshi News home page

శింబు @ అరసన్

Oct 8 2025 3:45 AM | Updated on Oct 8 2025 3:45 AM

Simbu and director Vetrimaaran upcoming film titled Arasan finalized

హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్  కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాకు ‘అరసన్ ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కలైపులి ఎస్‌. థాను నిర్మించనున్న ఈ మూవీ టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. ‘అరసన్ ’ కథ నార్త్‌ చెన్నై నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అని టాక్‌. ఈ నెలలోనే రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్‌.

శింబు కెరీర్‌లోని ఈ 49వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంత, సాయిపల్లవి, రుక్మిణీ వసంత్‌లను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్‌. ఈ చిత్రానికి అనిరుధ్‌  సంగీతం అందిస్తార ని కోలీవుడ్‌ టాక్‌. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement