Sidharth Shukla: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సిద్ధార్థ్ శుక్లా.. ఫొటో వైరల్

ఒకరు ఎం.ఎస్.ధోనితో బాలీవుడ్ వెండితెర స్టార్‌గా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. మరొకరు హిందీ హిట్ సీరియల్ బాలికా వధుతో బుల్లితెర స్టార్ మారిన సిద్ధార్థ్ శుక్లా. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం వారిద్దరూ దాదాపు ఏడాది వ్యవధిలో మరణించడమే..
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గతేడాది జూన్‌లో మరణించగా, నివేదికల ప్రకారం ఆత్మహత్యగా తేల్చారు. కాగా, బిగ్‌బాస్ సీజన్ 13 విజేత, బుల్లితెర నటుడు సిద్ధార్థ్ శుక్లా సెప్టెంబర్ 2న మరణించిన విషయం విదితమే. 40 ఏళ్ల సిద్ధార్థ్ అకాల మరణం తర్వాత ఆయన అభిమానులు సుశాంత్‌తో ఉన్న పాత ఫోటోను షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ నటులు నవ్వుతూ ఉన్న ఆ ఫోటోలో సుశాంత్ జీన్స్, ఎల్లో టీ షర్ట్‌తో క్యాప్ పెట్టి కొని ఉండగా, సిద్ధార్థ్ వైట్ అండ్ వైట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
#SiddharthShukla
Legend's gose without saying anything 🙏😭💐 #SiddharthShukla #SushantSinghRajput pic.twitter.com/TvkzkAg0a6— 👑दिव्या किरण👑 (@DivYaKiRaN05) September 2, 2021
'బాలికా వధు'లో చేసిన పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న శుక్లా ' దిల్ సే దిల్ తక్ ',' బిగ్ బాస్ 13 ',' ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7 'వంటి వివిధ షోలతో అలరించాడు. ఫిట్‌గా ఉన్నందుకు పాపులారిటీ సాధించిన ఆయన ఖత్రోన్ కే ఖిలాడీ 7 విజేతగా సైతం నిలిచారు. కాగా, సిద్దార్థ్ మృతి పట్ల భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమల్లోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
చదవండి: Sidharth Shukla Last Post: వైరల్‌గా మారిన సిద్దార్థ్ చివరి పోస్ట్