నితిన్‌ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్‌ | Shivani Rajasekhar Comments On Extra Ordinary Man Movie Hero Father Role | Sakshi
Sakshi News home page

Extra Ordinary Man Movie: నితిన్‌ సినిమాను నాన్న ఎందుకు ఒప్పుకున్నారంటే: శివాని రాజశేఖర్‌

Published Thu, Nov 16 2023 11:03 AM | Last Updated on Thu, Nov 16 2023 11:23 AM

Shivani Rajasekhar Comments On Extra Ordinary Man Movie Hero Father Role - Sakshi

తెలుగులో యాంగ్రీ యంగ్‌మేన్‌ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్‌ పేరే. వెండితెరపై ఆవేశంతో కూడిన పాత్రల్లో కనిపిస్తూ... టాప్‌ హీరోగా దశాబ్దాలపాటు ప్రేక్షకుల్ని అలరించి ఎనలేనీ కీర్తి సంపాధించుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలెన్నో ఆయన చేశారు. తాజాగా ఆయన నితిన్‌ సినిమాలో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా’లో రాజశేఖర్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా "కోటబొమ్మాళి పీఎస్‌" సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్‌ ఈ సినిమా ఎందుకు ఓకే చేశారో ఆయన కూతురు శివాని చెప్పింది.

'నాన్నగారికి చాలా రోజుల నుంచి  విలన్‌గా చేయాలని కోరిక ఉంది. అందులో భాగంగ కొన్ని కథలు విన్నాడు. కొన్ని నచ్చలేదని పక్కన పెట్టేశాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో విజయ్‌ సేతుపతి, అరవింద స్వామి వంటి టాప్‌ హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించారు. అలా నాన్నగారికి కూడా విలక్షణ పాత్రలు చేయాలని ఉంది. కానీ ఇప్పటి వరకు బెటర్‌ స్టోరీ రాలేదు. నితిన్‌ సినిమాలోని రాజశేఖర​ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఆయన పాత్ర ఎంతగానో నచ్చింది.. అందుకే ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. నాకు తెలిసినంత వరకు ఆ పాత్ర థియేటర్‌లో అదిరిపోతుంది.' అని శివాని తెలిపింది.

'కోటబొమ్మాళి పీఎస్' మూవీ గురించి శివాని మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 15' తమిళ్ రీమేక్‌లో నా నటన చూసి తేజ నాకు ఈ కథ చెప్పారు. అందులో  ట్రైబల్ అమ్మాయిగా నటించా.  ఇందులో అలాంటి పాత్రనే కావడంతో నన్ను సంప్రదించారు. ఇది నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. విలేజ్‌లో కనిపించే లేడీ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించా. మా ఫ్యామిలీలో తాతగారు పోలీస్ కావడం..  నాన్న చాలా చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో వారి నుంచి  ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నా గెటప్ కోసం నాన్న కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement