
'షష్టి పూర్తి' సినిమా నుంచి క్రేజీ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట కూడా వారిద్దరి మధ్యనే తెరకెక్కించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా సందడి చేయనున్నారు. ఇప్పటికే మంచి లవ్ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చే పాటలు ఈ మూవీ నుంచి విడుదలయ్యాయి. తాజాగా 'షష్టి పూర్తి' కార్యక్రమం తంతు గురించి మరో పాటను పంచుకున్నారు. సంగీతం ఇళయరాజా అందించారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది.