Satya Dev : సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన నటించిన 'గుర్తుందా శీతాకాలం' విడుదలకు సిద్దం అవుతుండగా, మరో సినిమా గాడ్సే కూడా రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్17న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే టీజర్‌తో పాజిటివ్ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాను తొలుత మే20న రిలీజ్ చేయాలని భావించినా అది కుదరలేదు. దీంతో కొత్త రిలీజ్ డేట్‌తో అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది. బ్రహ్మాజీ, సిజ్జూ మీనన్ కీలక పాత్రలు పోషించారు.
Only the date has changed. Not the cause.
Godse from June 17, 2022. #GodseOnJune17
@MeGopiganesh @AishuLekshmi @actorbrahmaji @NagaBabuOffl @mrnoelsean @theprakashnag @CKEntsOffl @vamsikaka @adityamusic pic.twitter.com/cuS9SM61XX
— Satya Dev (@ActorSatyaDev) May 18, 2022
మరిన్ని వార్తలు