మేకోవర్‌ కోసం కష్టపడుతున్న భామలు.. దేనికైనా రెడీ

Samantha Varalakshmi Sarathkumar And Other Heroines Tranforms For thier roles - Sakshi

న్యూ ప్రాజెక్ట్స్‌ కోసం కొందరు హీరోయిన్స్‌ కొత్త చాలెంజ్‌లు తీసుకున్నారు. న్యూ మేకోవర్‌ కోసం పర్‌ఫెక్ట్‌ డైట్, వర్కౌట్స్‌తో క్యారెక్టర్స్‌కు తగ్గట్లు మౌల్డ్‌ అవుతున్నారు. అలాంటి వారిలో సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ వంటి వారు ఉన్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

► ప్రస్తుతం మార్షల్‌ ఆర్ట్స్, వర్కౌట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు సమంత. ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌సిరీస్‌ తర్వాత దర్శక–ద్వయం రాజ్‌ అండ్‌ డీకేలతో సమంత మరో వెబ్‌సిరీస్‌ చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసందే. ఇందులో బాలీవుడ్‌ యాక్టర్‌ వరుణ్‌ ధావన్‌ మరో లీడ్‌ యాక్టర్‌. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పాత్ర చాలా పవర్‌ఫుల్‌ అండ్‌ యాక్షన్‌తో ఉంటుందట. అందుకే సమంత ఈ ప్రాజెక్ట్‌ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్నారని టాక్‌. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత లుక్‌ కూడా కొత్తగా ఉంటుందనీ, ఆల్రెడీ వర్క్‌షాప్స్‌ మొదలయ్యాయని, త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌పై అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్‌ టాక్‌. 

► హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌ మరోసారి లాఠీ పట్టనున్నారట. రీసెంట్‌ వచ్చిన తమిళ చిత్రం ‘సానికాయిదమ్‌’(తెలుగులో ‘చిన్ని’)లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటించారామె. తాజాగా మరోసారి పోలీసాఫీసర్‌గా(ఎస్‌ఐ) నటించనున్నారు. తమిళ చిత్రాలు ‘హీరో’, ‘విశ్వాసం’, ‘అన్నాత్తే’లకు కథా రచయితగా పని చేసిన ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. ఈ చిత్రంలో ‘జయం’ రవి హీరోగా నటిస్తారు. ఈ మూవీలోనే కీర్తీ సురేశ్‌ పోలీసాఫీసర్‌గా నటించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఈ పాత్ర కోసమే ఆమె కాస్త బరువు పెరిగి, ఫిట్‌గా ఉండేలా వర్కౌట్స్‌ చేస్తున్నారని తెలిసింది.

► కాగా ఈ చిత్రంలో కీర్తితో పాటు మరో హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ కూడా నటిస్తారట. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా... ఇలా డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చు కున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఓ కొత్త సినిమా కోసం ఆమె బాగా బరువు తగ్గి, స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘నువ్వు ఏం చేయాలో, చేయకూడదో ఇతరులు నీకు చెప్పేలా ఉండకూడదు. ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా తీసుకుని ముందడుగు వేయాలి.

నా కొత్త లుక్‌ కోసం దాదాపు నాలుగు నెలలు కష్టపడ్డాను’ అంటూ తన లేటెస్ట్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. ఓ కొత్త ప్రాజెక్ట్‌ కోసమే ఆమె ఇలా స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయారని కోలీవుడ్‌ టాక్‌. అయితే సమంత, కీర్తీ సురేశ్, వరలక్ష్మి.. వీరే కాదు.. మరికొంతమంది హీరోయిన్స్‌ కూడా న్యూ ప్రాజెక్ట్స్‌ కోసం కొత్త మేకోవర్‌కు రెడీ అవుతున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top