samantha: 'అసలు బుద్ధి ఉందా' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చిన సామ్

Samantha Fires On A Reporter: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన స్టాఫ్‌తో కలిసి ఆమె తిరుమలకు చేరుకుంది. అయితే దర్శనం అనంతరం బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్..'మీ గురించి రూమర్స్ వస్తున్నాయి' అంటూ ప్రశ్నించడంతో సీరియస్ అయిన సమంత.. 'గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి? అసలు బుద్ధి ఉందా' అంటూ ఘాటుగా స్పందించింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. దేవుని దర్శనం కోసం వచ్చినప్పుడు కూడా వ్యక్తిగత ప్రశ్నలు అడగడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలె శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఆమె షూటింగ్స్‌లో పాల్గొననుంది.
Sam really proud of you!! Some people don’t understand what to ask when .. Just loved that reply of yours !@Samanthaprabhu2
.
.#SamanthaAkkineni #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/5RUO5bbhbz— Multi Fandom (@multifandom5928) September 18, 2021