రెండో పెళ్లిపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు | Samantha Ruth Prabhu Opinion On Her Second Marriage - Sakshi
Sakshi News home page

Samantha: రెండో పెళ్లి.. సమంత ఏమన్నారంటే..?

Dec 17 2023 9:29 PM | Updated on Dec 17 2023 9:57 PM

Samantha Opinion On Second Marriage - Sakshi

నాగచైతన్యతో విడాకుల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ సమంత ఒంటరిగానే ఉంటోంది. డైవోర్స్‌ తీసుకున్న కొన్నాళ్లకే మయోసైటిస్‌  బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు కూడా బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత  కాస్త కోలుకొని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌ని కంప్లీట్‌ చేసింది. ప్రస్తుతం సినిమాలకు లాంగ్‌ బ్రేక్‌ ఇచ్చి.. పూర్తి సమయాన్ని ఆరోగ్యానికి కేటాయించింది. విహారయాత్ర పేరుతో విదేశాలు తిరుగుతూ.. సోలో లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది.

సామ్‌ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఖాలీ సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో చిట్‌చాట్‌ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన సామ్‌.. ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. చాటింగ్‌లో భాగంగా ఓ నెటిజన్‌ రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవడం లేదని అడిగాడు. దానికి సమంత ఫన్నీగా ఆన్సర్‌ ఇచ్చింది. 

ఇండియాలో మొదటి పెళ్లి కంటే రెండు, మూడో పెళ్లిళ్లకే విడాకుల రేటు ఎక్కువగా ఉంటుందంటూ గణాంకాలను చూపుతూ.. ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. వివాహం అనేది సరైన పెట్టుబడి కాదని పన్నీగా రియాక్ట్‌ అయింది. 2023తనకు వరస్ట్‌ ఇయర్‌ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, నాగచైతన్య కూడా రెండో పెళ్లిపై ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement