ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్‌లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 రానుంది. నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఢిల్లీ క్రైమ్-3 ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఎవరికీ అంతుపట్టకుండా సాగే వరుస హత్యలను చేధించే క్రమంలో పోలీసుల జరిపే శోధన ఎలా ఉంటుందో ఇందులో చూపారు.
ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. ఈ రెండూ భారీ విజయం అందుకోవడంతో సీజన్-3ని తెరకెక్కించారు. ‘ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు ఫర్ అవుట్‌స్టాండింగ్ డ్రామా సిరీస్’ అవార్డ్‌ను అందుకున్న తొలి భారతీయ వెబ్‌సిరీస్‌గా ‘ఢిల్లీ క్రైమ్’ నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్-3లొ షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ నటించారు. రిచీ మెహతా, తనూజ్ చోప్రా ఈ సిరీస్‌ని రూపొందించారు.

దేశంలో ఒకప్పుడు నిర్భయ అత్యాచారం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు ఎలా ఇన్విస్టిగేషన్ చేశారనే తీరును ఫస్ట్ సీజన్‌లో చూపారు. వృద్ధులను టార్గెట్ చేసుకుని నగరంలో జరిగే వరసు హత్యలకు సంబంధించిన దర్యాప్తు ఆధారంగా రెండో సీజన్ రూపొందించారు. అయితే, సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించనున్నారు.


