Samantha Instagram Post About Human Nature Goes Viral
Sakshi News home page

Samantha: 'అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది'

Nov 1 2021 2:14 PM | Updated on Nov 1 2021 5:04 PM

Samantha Instagram Post About Human Nature Goes Viral - Sakshi

Samantha Instagram Post About Human Nature Goes Viral: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌పై మరింత ఫోకస్‌ పెరిగింది. సాధారణంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్‌..విడాకుల తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె షేర్‌ చేస్తున్న పోస్టుల్లో మాత్రం ఏదో తెలియని బాధ, ప్రశ్నించే తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవలె అమ్మాయికి పెళ్లి కంటే చదువు ముఖ్యమని తల్లితండ్రులకు సూచిస్తూ పోస్ట్‌ చేసిన సమంత తాజాగా మరో ఎమోషనల్‌ పోస్టును షేర్‌ చేసింది.

మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే మనమేంటో తెలియజేస్తాయి. తట్టుకోలేని ఒత్తిడికి గురైన సమయంలోనే మనిషి అసలు స్వభావం బయటపడుతుంది అంటూ ప్రముఖ రైటర్‌ రాబ‌ర్ట్ కొటేష‌న్‌ను ఇన్‌స్టా స్టోరీలో అభిమానులతో పంచుకుంది. తాజాగా సమంత చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కాగా ఇటీవలె సామ్‌ చార్‌ధామ్‌ యాత్ర అనంతరం దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విడాకుల నిర్ణయంతో కుంగిపోయిన సామ్‌..మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌ ట్రిప్స్‌కు వెళ్తుందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement