ఒక్క చోట చేరిన అక్కినేని కుటుంబం! | Samantha Christmas 2020 Celebrations With Family Pics | Sakshi
Sakshi News home page

కుటుంబంతో సమంత ఆనంద క్షణాలు

Dec 26 2020 8:11 PM | Updated on Dec 26 2020 8:37 PM

Samantha Christmas 2020 Celebrations With Family Pics - Sakshi

హైదరాబాద్‌: క్రిస్మస్‌ సందర్భంగా అక్కినేని కుటుంబమంతా ఒక్కచోట చేరింది. ఇందుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను నటి, అక్కినేని వారి కోడలు సమంత తన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతా కలిసి క్రిస్మస్‌ పర్వదినాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంతో పాటు 2020కి వీడ్కోలు పలికినట్లు వెల్లడించారు. అమల- నాగార్జున, సమంత- నాగచైతన్య దంపతులతో పాటు అఖిల్‌, సుమంత్‌, సుశాంత్‌, సుప్రియ సహా ఇతర కుటుంబ సభ్యులు ఒకే ఫ్రేములో ఉన్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

ఈ క్రమంలో.. ‘‘సూపర్‌.. మీ అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’ అంటూ కామెంట్లతో పాటు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఫ్యాషన్‌ క్వీన్‌ సమంత ఈ పార్టీలో మెటాలిక్‌ గోల్డ్‌ డ్రెస్‌తో అదరగొట్టారు. కాగా పెళ్లి తర్వాత కెరీర్‌ను విజయవంతగా కొనసాగిస్తున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్‌ 2తో ఓటీటీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా సామ్‌ జామ్‌ కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నాగ చైతన్య విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు.(చదవండి: సమంతతో ఆఫర్‌ కొట్టేసిన అభిజిత్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement