బావతో కలిసి సల్మాన్‌ థియేటర్స్‌కి వచ్చేది ఎప్పుడంటే.. | Salman Khan Going to Hit Theatres on November 26 with Antim | Sakshi
Sakshi News home page

Salman Khan's Antim: సల్మాన్‌ ‘అంతిమ్‌’ విడుదల తేది ఫిక్స్‌ 

Oct 13 2021 8:08 AM | Updated on Oct 13 2021 8:09 AM

Salman Khan Going to Hit Theatres on November 26 with Antim - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’. ఇందులో ఆయన బావ, అర్పితా ఖాన్‌ భర్త ఆయుష్‌ శర్మ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ  సినిమాను నవంబర్‌ 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు సల్లు భాయ్‌.


 సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా జీ స్టూడియోస్‌కి మంచి పేరు తీసుకొస్తుందని ఆయన తెలిపారు. కాగా ఈ నిర్మాణ సంస్థలో ఇప్పటికే సల్మాన్‌ ఇప్పటికే రేస్‌ 3, లవ్‌ యాత్రి, భారత్‌, దబాంగ్‌ 3, కాగజ్‌, రాధే వంటి సినిమాలు చేశాడు. బావతో కలిసి సల్మాన్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తాడోనని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.

చదవండి: కష్టాల్లో సల్మాన్‌ తోడుగా ఉంటాడన్న షారుక్‌.. పాత వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement