‘క్రాక్‌’ కాంబినేషన్‌ రిపీట్‌.. నాలుగోసారి మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యేనా? | RT4GM: Ravi Teja And Gopichand Malineni 4th Film Update, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Raviteja RT4GM Movie Update: ‘క్రాక్‌’ కాంబినేషన్‌ రిపీట్‌.. నాలుగోసారి మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యేనా?

Published Wed, Oct 25 2023 5:00 PM

RT4GM: Ravi Teja And Gopichand Malineni 4th Film Update - Sakshi

మాస్ మహారాజా రవితేజ, మాస్‌ మేకర్‌ గోపీచంద్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తుందంటే.. కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. దానికి కారణం వీరిద్దరి కాంబోలో వచ్చిన డాన్‌ శీన్‌, బలుపు, క్రాక్‌.. మూడు చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. త్వరలోనే వీరిద్దరి కాంబోలో నాలుగో చిత్రం (RT4GM) రాబోతుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.

 కొన్ని నెలల క్రితం పవర్ ఫుల్ పోస్టర్‌ ద్వారా సినిమాని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ 'బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి' అని అనౌన్స్ చేశారు. ఈరోజు, రేపు ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లు వస్తాయి. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు సెల్వరాఘవన్. ఈ పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుందని చిత్రయూనిట్‌ పేర్కొంది . నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement