RRR Latest Update: Ram Charan New Poster Releasing As Birthday Special - Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ బర్త్‌డేకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్పెషల్‌ గిఫ్ట్‌!

Mar 21 2021 3:08 PM | Updated on Mar 21 2021 4:32 PM

RRR Team To Unveil New Poster On Ram Charan Birthday - Sakshi

మరో వారంలో రామ్‌చరణ్‌ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. దానికోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన తాజా చిత్రాల అప్‌డేట్స్‌ని ఆశించడం సహజం. బర్త్‌ డేకి ఫ్యాన్స్‌కు కొత్త పోస్టర్‌ రూపంలో గిఫ్ట్‌ ఇవ్వనున్నారు చరణ్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరణ్‌ పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను బర్త్‌ డే సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో చరణ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే శంకర్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా ఓ ప్యాన్‌ ఇండియన్‌ మూవీ రూపొందనుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కూడా బర్త్‌ డేకి వచ్చే అవకాశం ఉంది.


చదవండి:
హీటెక్కిస్తున్న‘సీటీమార్‌’ పెప్సీ ఆంటీ సాంగ్‌‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement