
Runtime locked for Rajamouli’s RRR! : ‘రౌద్రం... రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) సినిమా లెంగ్త్ లాక్ అయినట్లు తెలిసింది. ఈ ప్యాన్ ఇండియన్ మూవీ 2 గంటల 45 నిమిషాల నిడివి ఉంటుందని టాక్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఫుటేజీ 3 గంటలకు పైగా ఉందనీ, అయితే ఈ సినిమా ఫైనల్ కాపీని 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్ చేశారనీ ఫిలింనగర్ టాక్.
ఇంకాస్త నిడివి తగ్గించాలని ప్రయత్నించినప్పటికీ ఎమోషన్స్‌తో కూడిన ఫైట్స్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ తదితర ముఖ్య సన్నివేశాల కారణంగా ఫైనల్ కాపీ లెంగ్త్‌ని 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారట. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విదేశీ భాషలతో కలిపి దాదాపు పధ్నాలుగు భాషల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.