Sakshi News home page

Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్‌ హిట్స్

Published Sat, Dec 30 2023 5:51 PM

Rewind 2023: Small budget movies bechame superhit in Tollywood - Sakshi

ఈ ఇయర్‌లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి.  ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచిన స్మాల్‌ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం.

బలగం
ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

బేబి
ఈ ఏడాది సూపర్‌ హిట్‌ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్‌ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్‌ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్‌ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్‌ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. 

మ్యాడ్‌
అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్‌ చేశారు. విడుదల​కు ముందు మ్యాడ్‌ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్‌(అక్టోబర్‌ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది.  కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్‌ నిలిచింది. 

ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది.  సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్‌ మూవీ పిండం కూడా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement