డబ్బున్నోడిదే ప్రాణమా? అన్న నెటిజన్‌.. ఏకిపారేసిన రేణు

Renu Desai Slams Netizen For Accusing Her Helping Only Rrich - Sakshi

సరదా కోసం, సినిమా ప్రమోషన్ల కోసం వాడుకునే సోషల్‌ మీడియాను కోవిడ్‌ కాలంలో పేషెంట్ల కోసం, ఆపదలో ఉన్నవారి కోసం సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందక, మందులు లేక సతమతమవుతున్న ఎంతోమందికి సోషల్‌ మీడియా పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న పలువురు సెలబ్రిటీలు ఆపత్కాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం చేస్తున్నారు. నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ కూడా ఈ కోవలోకే చెందుతుంది. 

అయితే ఆమె చేస్తున్న ఈ మంచిపనిని ఓ నెటిజన్‌ తప్పు పట్టాడు. సాయం చేస్తున్నా అంటూ కేవలం ధనవంతులనే పట్టించుకుంటున్నారని విమర్శించాడు. మధ్య తరగతి వాళ్లకు సాయం చేయడం లేదని నిందించాడు. డబ్బులు ఉన్నవాళ్లవే ప్రాణాలు కానీ మధ్య తరగతి మనుషులవి ప్రాణాలు కాదా? అని నిలదీశాడు. దీంతో రేణు దేశాయ్‌ ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ వివరణ ఇచ్చుకుంది.

"10, 12 రోజులుగా నాకు తోచినంత సాయం చేస్తూ వస్తున్నాను. మీరు నన్ను ప్రశ్నించడానికి నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు, మీరు ఎన్నుకున్న లీడర్‌ను అసలే కాదు. ఇలాంటివి మీరు ఓటేసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ప్రశ్నించండి. కొందరు హెల్ప్‌ చేస్తారా? లేదా? అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు, డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే మంచి చేయాలన్న నా లక్ష్యం దెబ్బతింటుంది. ఒకవేళ పొరపాటున మీ మెసేజ్‌ను వదిలేసుంటే మరొకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఓవైపు సాయాన్ని అర్థిస్తూ, మరోవైపు పనికిరాని చెత్త మెసేజ్‌లతో నా ఇన్‌బాక్స్‌ నిండిపోయింది. కాబట్టి ప్లీజ్‌, దయచేసి అర్థం చేసుకోండి' అని రేణు దేశాయ్‌ అభ్యర్థించింది.

చదవండి: నెటిజన్లపై రేణూ దేశాయ్‌ ఫైర్‌.. ప్రాణాలు పోతున్నాయంటూ..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top