Rashmika Mandanna Meets Orthopedic Doctor Gurava Reddy - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ప్రముఖ డాక్టర్‌ని కలిసిన రష్మిక.. అసలు ఏమైందంటే..

Sep 24 2022 1:29 PM | Updated on Sep 24 2022 2:42 PM

Rashmika Mandanna Meets Orthopedist Doctor Guruva Reddy - Sakshi

ఛలో సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా 'పుష్ప' సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ సహా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవలె సీతారామం సినిమాతో అలరించింది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్‌ గురువారెడ్డిని కలిసింది.

గత కొంతకాలంగా రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా గురువారెడ్డి సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని, అయితే పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.

"నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని మోకాలి నొప్పి అంటూ నా దెగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి సరదాగా పెదవి విరుస్తూ ఇలా అన్నాను.. పుష్ప సినిమా చుసిన మొదలు రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది! బన్నీ కూడా త్వరలో Shoulder pain తో వస్తాడేమో'' అంటూ ఫన్నీగా తన ఫేస్‌బుక్‌ స్టోరీలో రాసుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement