ఐదు భాషల్లో డబ్బింగ్‌  | Rashmika dubs first time in Malayalam for The Girlfriend teaser | Sakshi
Sakshi News home page

ఐదు భాషల్లో డబ్బింగ్‌ 

Published Mon, Apr 1 2024 12:23 AM | Last Updated on Mon, Apr 1 2024 12:15 PM

Rashmika dubs first time in Malayalam for The Girlfriend teaser - Sakshi

‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్‌ స్టయిల్‌లో చెప్పిన డైలాగ్‌ చాలా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్‌ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్‌’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు.

ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్‌ రోల్‌ చేస్తున్న ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రం టీజర్‌కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్‌ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ చిత్రదర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్‌ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్‌కి డబ్బింగ్‌ చెప్పించిన రాహుల్‌ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్‌ చెప్పిస్తారేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement