ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్‌ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం | Rana Naidu: Brahmanandam Oscar Naidu Leaked Audition | Sakshi
Sakshi News home page

Rana Naidu: వెంకటేశ్‌ పాత్ర నేను చేయాల్సింది.. ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం

Mar 12 2023 8:29 PM | Updated on Mar 12 2023 8:35 PM

Rana Naidu: Brahmanandam Oscar Naidu Leaked Audition - Sakshi

విక్టరీ వెంకటేశ్‌, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్‌ సిరీస్‌ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్‌ వీడియోని నెట్‌ఫిక్స్‌ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను  ఆస్కార్‌ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్‌లో వెంకటేశ్‌ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్‌ కోసం ఆడిషన్స్‌ ఇచ్చాడు.

కిరీటి దామరాజు డైరెక్టర్‌గా, జబర్దస్త్‌ అవినాష్‌ ఆయన అసిస్టెంట్‌గా కనిపించారు. ఈ స్పెషల్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్‌ చూసి విసుగుచెందిన వెంకటేశ్‌..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్‌కి నా ఏజ్‌ సరిపోలేదని.. వెంకటేశ్‌ను పెట్టారు. ఓకే..  ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్‌ రానా నాయుడు. స్ట్రీమింగ్‌ ఆన్‌ నెట్‌ఫ్లిక్స్‌’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement