ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి: ఆర్జీవీ

Ram Gopal Varma Unveils Jaathiya Rahadari Trailer - Sakshi

‘‘జాతీయ రహదారి’ చిత్రం ట్రైలర్‌ మనసుకు హత్తుకునేలా ఉంది. కరోనా సమయంలో జరిగిన రెండు ప్రేమ కథలకి నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి’’ అని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) అన్నారు. మధు చిట్టె, సైగల్‌ పాటిల్, మమత, ఉమాభారతి ముఖ్య పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతీయ రహదారి’.

రవి కనగల సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని రామ్‌గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో మా చిత్రం 200 థియేటర్స్‌లో విడుదలవుతోంది’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘వర్మగారి ‘శివ’ సినిమా చూసి సినిమా పరిశ్రమకు వెళ్లాలని చెన్నైకి ట్రైన్‌ ఎక్కిన వాళ్లలో నేను కూడా ఒకణ్ణి. మా చిత్రం ట్రైలర్‌ విడుదల చేసి, బావుందని మెచ్చుకున్న ఆయనకు థ్యాంక్స్‌’’ అన్నారు నరసింహ నంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top