ఎంటర్‌టైనింగ్‌గా 'రాకాస' ట్రైలర్ | Rakasa Movie Trailer | Sakshi
Sakshi News home page

RĀKĀSĀ Trailer: భయపెడుతూ నవ్వించిన ట్రైలర్.. మీరు చూశారా?

Mar 25 2026 6:29 PM | Updated on Mar 25 2026 7:01 PM

Rakasa Movie Trailer

'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలతో ఎంటర్‌టైన్ చేసిన సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా 'రాకాస'. మెగా డాటర్ నిహారిక నిర్మించగా.. మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా పరిచయమవుతోంది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?)

ట్రైలర్ బట్టి చూస్తే.. ఇదివరకు వచ్చిన హారర్ సినిమాల్లానే ఇందులో స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ మాత్రం సంబంధం లేని హీరో, ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడే ఉండే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా హీరో సమస్యల్లో చిక్కుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడికి ఆహారంగా ఊరంతా కలిసి ఇతడిని పాడుబడ్డ కోటలోకి పంపిస్తారు. అక్కడ హీరోకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: రేలంగి మామయ్యగా ఒకవేళ రాజశేఖర్ చేసుంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement