పుష్ప-2 హీరోపై కామెంట్స్‌.. స్పందించిన రాజేంద్ర ప్రసాద్ | Rajendra Prasad Responds On Pushpa 2 comments On event | Sakshi
Sakshi News home page

Puhspa 2 The Rule: అల్లు అర్జున్‌పై కామెంట్స్‌.. అలాంటి వారినే తెరపై చూపిస్తాం: రాజేంద్ర ప్రసాద్

Jan 8 2025 5:40 PM | Updated on Jan 8 2025 7:08 PM

Rajendra Prasad Responds On Pushpa 2 comments On event

పుష్ప-2 సినిమాపై టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేశారు. హరికథ వెబ్‌ సిరీస్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు.. ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయని అన్నారు. అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

ఆ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..'త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకు వచ్చేశాం. ఈ కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న వాడెవడో చందనం దొంగ హీరో.. సరే, ఈరోజుల్లో హీరో అనే పదానికి అర్థాలే మారిపోయాయి.' అని అన్నారు.

‍అయితే తాజాగా తన కామెంట్స్‌పై రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. పుష్ప -2 చిత్రంలో హీరో పాత్రపై ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాజాగా షష్టిపూర్తి అనే మూవీ ప్రెస్‌ మీట్‌కు హాజరైన ఆయన తన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు ఇదే విషయంపై మాట్లాడుకున్నామని తెలిపారు. సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులు చూసి ఇద్దరం నవ్వుకున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగెటివ్‌గా చూడకూడదు. సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై చూపిస్తామని ఆయన అన్నారు.

హీరో అనే పదానికి అర్థాలు మారిపోయాయి. సద్గుణాలు, విలువలు కలిగినవారే ఒకప్పుడు హీరోలు. కానీ ఇప్పుడు జులాయిగా, చెడు అలవాట్లు ఉండి.. అడ్డదారులు తొక్కేవారిని కూడా హీరో పాత్రలుగా చిత్రీకరిస్తున్నారు. జనాలు కూడా ఈ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోలనే ఇష్టపడుతున్నారు. అయితే పుష్ప -2 సినిమాను కూడా ఈ జాబితాలోనే వేసేశాడు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌.

కాగా.. రాజేంద్రప్రసాద్, నటి అర్చన చాలా ఏళ్ల తర్వాత కలిసిన నటిస్తోన్న తాజా చిత్రం షష్టిపూర్తి. ఈ చిత్రానికి పవన్ ప్రభాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రుపేశ్ చౌదరిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈసినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రాజేంద్ర ప్రసాద్ పుష్ప-2 సినిమాపై చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

పుష్ప వసూళ్ల సునామీ.. 

కాగా.. అల్లు అర్జున్ పుష్ప-2 రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1831 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఇంకా దూసుకెళ్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టింది. బాలీవుడ్‌లోనూ తిరుగులేని చరిత్ర సృష్టించింది. ఇప్పటికే రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాన్ హిందీ సినిమాగా నిలిచింది.

పుష్ప రీ లోడెడ్..

తాజాగా పుష్ప-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే థియేటర్లలో రన్‌ అవుతోన్న పుష్ప-2 మూవీకి అదనంగా మరో 20 నిమిషాల పాటు సీన్స్‌ యాడ్ చేయనున్నారు. ఈ అప్డేట్ వర్షన్ సంక్రాంతి కానుకగా ఈనెల 11 నుంచి బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 రీ లోడెడ్ పేరుతో మరిన్నీ సన్నివేశాలు యాడ్ చేస్తున్నారు. ది వైల్డ్‌ ఫైర్ గెట్స్ ఎక్స్‌ట్రా ఫైరీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పొంగల్‌కు మరోసారి పుష్ప-2 లేటేస్ట్ వర్షన్‌ చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement